hydra: హైడ్రాపై హైకోర్టు సీరియస్

Update: 2025-07-05 09:30 GMT

అక్రమ ని­ర్మా­ణాల పే­రు­తో ని­వాస గృ­హా­ల­ను కూ­ల్చ­డం­పై తె­లం­గాణ హై­కో­ర్టు మరో­సా­రి గ్రే­ట­ర్ హై­ద­రా­బా­ద్ ము­న్సి­ప­ల్ కా­ర్పొ­రే­ష­న్ (హై­డ్రా)పై ఆగ్ర­హం వ్య­క్తం చే­సిం­ది. సు­న్నం చె­రు­వు పరి­స­రా­ల్లో ని­వాస గృ­హా­ల­ను ముం­ద­స్తు నో­టీ­సు­లు ఇవ్వ­కుం­డా కూ­ల్చి­వే­స్తు­న్నా­రం­టూ పౌ­రు­లు దా­ఖ­లు చే­సిన పి­టి­ష­న్‌­పై వి­చా­రణ ని­ర్వ­హిం­చిన హై­కో­ర్టు, "ఇల్లు కూ­ల్చ­డా­ని­కి కూడా ఒక పద్ధ­తి ఉం­డా­లి" అంటూ గట్టి­గా వ్యా­ఖ్యా­నిం­చిం­ది. పి­టి­ష­న­ర్లు సమ­ర్పిం­చిన పత్రా­ల్లో ఎలాం­టి లో­పా­లూ లే­వ­ని స్ప­ష్టం­చే­సిన న్యా­య­స్థా­నం, హై­డ్రా తీ­రు­ను తప్పు­బ­ట్టిం­ది. సర్వే­లు జర­ప­కుం­డా, ఎఫ్‌­టీ­ఎ­ల్ (ఫుల్ ట్యాం­క్ లె­వె­ల్) ను అధి­కా­రి­కం­గా ని­ర్ధా­రిం­చ­కుం­డా అక్రమ ని­ర్మా­ణాల పే­రు­తో చర్య­లు చే­ప­ట్ట­డా­న్ని హై­కో­ర్టు తీ­వ్రం­గా తప్పు­ప­ట్టిం­ది. "ఎన్ని సా­ర్లు చె­ప్పి­నా మీరు మా­ర­డం లే­దేం­టి?" అంటూ హై­డ్రా­పై తీ­వ్ర వ్యా­ఖ్య­లు చే­సిన న్యా­య­స్థా­నం, సు­న్నం చె­రు­వు పు­న­రు­ద్ధ­ర­ణ­కు సం­బం­ధిం­చిన అను­మ­తు­లు పొం­దేం­దు­కు దర­ఖా­స్తు చే­యా­ల­ని ప్ర­భు­త్వ యం­త్రాం­గా­ని­కి ఆదే­శిం­చిం­ది. అలా­గే తదు­ప­రి ఆదే­శా­లు వచ్చే­వ­ర­కు సు­న్నం చె­రు­వు పరి­సర ప్రాం­తా­ల్లో ఎటు­వం­టి కూ­ల్చి­వే­త­లు చే­ప­ట్ట­కూ­డ­ద­ని స్ప­ష్టం చే­సిం­ది.

Tags:    

Similar News