HYDRA: రూ.110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

కోర్టు తీర్పుతో ఆక్రమణల తొలగింపు

Update: 2025-10-18 03:30 GMT

గో­షా­మ­హ­ల్ ని­యో­జ­క­వ­ర్గం పరి­ధి­లో­ని కు­ల్సుం­పు­రా­లో ఆక్ర­మ­ణ­ల­ను హై­డ్రా తొ­ల­‌­గిం­చిం­ది. 1.30 ఎక­‌­రాల ప్ర­భు­త్వ భూ­మి­ని స్వా­ధీ­నం చే­సు­కుం­ది. రూ.110 కో­ట్ల వి­లు­వైన ప్ర­భు­త్వ భూ­మి­ని హై­డ్రా కా­పా­డిం­ది. ప్ర­జా­వ­స­రా­ల­కు ఈ భూ­మి­ని వి­ని­యో­గిం­చా­ల­ని గతం­లో ప్ర­భు­త్వం భా­విం­చిం­ది. అశో­క్‌ సిం­గ్‌ అనే వ్య­క్తి దీ­న్ని త‌న భూ­మి­గా చె­బు­తు­న్నా­డు. ఈక్ర­మం­లో సిటీ సి­వి­ల్‌ కో­ర్టు ప్ర­భు­త్వా­ని­కి అను­కూ­లం­గా తీ­ర్పు ఇచ్చిం­ది. ఈ భూ­మి­లో ఇప్ప­టి­కే రెం­డు సా­ర్లు రె­వె­న్యూ అధి­కా­రు­లు ఆక్ర­మ­ణ­ల­ను తొ­ల­‌­గిం­చా­రు. అయి­నా అశో­క్‌ సిం­గ్ స్థ­లా­న్ని ఖాళీ చే­య­‌­డం­లే­దు. మరో­వై­పు ఖాళీ చే­యిం­చేం­దు­కు ప్ర­య­త్నిం­చిన అధి­కా­రు­ల­‌­పై దా­డు­ల­‌­కు పా­ల్ప­డ్డా­డు. అశో­క్ సిం­గ్‌­పై లం­గ­‌­ర్‌­హౌ­స్‌, మం­గ­‌­ళ్‌­హా­ట్‌, శా­హి­నా­య­‌­త్‌­గం­జ్ పో­లీ­సు స్టే­ష­‌­న్ల­లో 8కి పైగా కే­సు­లు నమో­ద­య్యా­యి. హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే వందల కోట్ల రూపాయల భూములను పరిరక్షించింది. 

సమగ్ర నివేదికను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రూపొందించారు. దీన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు పంపించారు. దీనిపై సమగ్ర సర్వేను నిర్వహించింది హైడ్రా. భూఆక్రమణ నిజమేనని తేలడంతో యాక్షన్ లోకి దిగింది. ఈ ఉదయం కూల్చివేత పనులు చేపట్టింది. భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు పోలీసులు. భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ భూమి తనదేనంటూ కొన్ని నకిలీ డాక్యుమెంట్లను సృష్టించాడు అశోక్ సింగ్. నాంపల్లి సిటీ సివిల్ కోర్టును సైతం ఆశ్రయించాడు. ఈ కేసు విషయంలో కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. అప్పట్లో కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారులు రెండుసార్లు భూమిని ఖాళీ చేయించారు కూడా. అయినప్పటికీ- అశోక్ సింగ్ మళ్లీ మళ్లీ భూమిని ఆక్రమించుకుని, దాని నుంచి అద్దె వసూలు చేస్తూ వచ్చాడు.

Tags:    

Similar News