HYDRA: హైడ్రా దూకుడుతో అక్రమార్కుల పరుగులు

బంజారాహిల్స్‌లో హైడ్రా కూల్చివేతలు.. రూ.750 కోట్ల భూములు రక్షించిన హైడ్రా.. 5 ఎకరాల భూమికి విముక్తి కల్పించిన హైడ్రా

Update: 2025-10-11 04:00 GMT

హై­ద­రా­బా­ద్‌­లో హై­డ్రా మరో­సా­రి దూ­కు­డు పెం­చిం­ది. మొ­న్న­టి వరకు అక్రమ ని­ర్మా­ణా­ల­పై దృ­ష్టి పె­ట్టిన హై­డ్రా ఇప్పు­డు కబ్జా­కు గు­రైన భూ­ము­ల­పై ఫో­క­స్ చే­సిం­ది. ఓవై­పు చె­రు­వుల పు­న­రు­ద్ధ­రణ, మరో­వై­పు కబ్జా­భూ­ముల స్వా­ధీ­నం­తో ప్ర­జ­లన ప్ర­శం­స­లు అం­దు­కుం­టోం­ది. ప్ర­భు­త్వ ఆస్తు­లు, చె­రు­వు­ల­ను రక్షిం­చ­డ­మే లక్ష్యం­గా పె­ట్టు­కు­న్న హై­డ్రా.. తా­జా­గా భా­గ్య­న­గ­రం­లో ఆక్ర­మ­ణ­కు గు­రైన ప్ర­భు­త్వ స్థ­లం­లో కూ­ల్చి­వే­త­లు చే­ప­ట్టిం­ది. బం­జా­రా­హి­ల్స్‌­లో­ని బస­వ­తా­ర­కం క్యా­న్స­ర్ ఆసు­ప­త్రి సమీ­పం­లో 5 ఎక­రాల ప్ర­భు­త్వ స్థ­లం ఆక్ర­మ­ణ­కు గు­రైం­ది. స్థా­ని­కుల ఫి­ర్యా­దు మే­ర­కు శు­క్ర­వా­రం హై­డ్రా కూ­ల్చి­వే­త­లు చే­ప­ట్టిం­ది. సు­మా­రు రూ.750 కో­ట్ల వి­లు­వైన ప్ర­భు­త్వ స్థ­లం­లో ఆక్ర­మ­ణ­ల­ను హై­డ్రా తొ­ల­గిం­చిం­ది. తె­ల్ల­వా­రు­జా­ము నుం­చే భారీ పో­లీ­సు బం­దో­బ­స్తు నడుమ హై­డ్రా సి­బ్బం­ది కూ­ల్చి­వే­త­లు చే­ప­ట్టిం­ది.

బం­జా­రా­హి­ల్స్ రోడ్ నం­బ­ర్ 10లో సర్వే నం­బ­ర్ 403లో ఐదె­క­రాల ప్ర­భు­త్వ భూమి ఉంది. ఇం­దు­లో 1.20 ఎక­రాల స్థ­లా­న్ని జల­మం­డ­లి­కి వా­ట­ర్ రి­జ­ర్వా­య­ర్ ని­ర్మా­ణం కోసం ప్ర­భు­త్వం గతం­లో కే­టా­యిం­చిం­ది. అయి­తే, పా­ర్థ­సా­ర­థి అనే వ్య­క్తి ఈ మొ­త్తం ఐదె­క­రాల భూమి తన­దే­నం­టూ అన్ రి­జి­స్ట­ర్డ్ సేల్ డీడ్ పత్రా­ల­తో కో­ర్టు­ను ఆశ్ర­యిం­చా­డు. వా­స్త­వా­ని­కి ఈ భూమి సర్వే నం­బ­ర్ 403 కాగా, అతను 403/52 అనే నకి­లీ సర్వే నం­బ­ర్‌­ను సృ­ష్టిం­చి మో­సా­ని­కి పా­ల్ప­డి­న­ట్లు అధి­కా­రు­లు గు­ర్తిం­చా­రు. ఈ క్ర­మం­లో భారీ పో­లీ­సు బం­దో­బ­స్తు నడుమ ఫె­న్సిం­గ్, షె­డ్ల­ను పూ­ర్తి­గా కూ­ల్చి­వే­శా­రు.

వేటకుక్కలతో పహారా

1.20 ఎక­రా­ల­తో­పా­టు మొ­త్తం 5 ఎక­రాల భూమి తన­దం­టూ పా­ర్థ­సా­ర­థి అనే వ్య­క్తి కో­ర్టు­కె­ళ్లా­డు. చు­ట్టూ ఫె­న్సిం­గ్ వేసి బౌ­న్స­ర్ల­తో­పా­టు వే­ట­కు­క్క­ల­ను కా­ప­లా­గా పె­ట్టా­రు. కో­ర్టు­లో వి­వా­దం ఉం­టుం­డ­గా మొ­త్తం 5 ఎక­రాల భూ­మి­ని తన ఆధీ­నం­లో­కి తీ­సు­కొ­ని అం­దు­లో షె­డ్డు­లు ని­ర్మిం­చు­కొ­ని పహరా పె­ట్టా­రు. ప్ర­భు­త్వ భూ­మి­లో­నే అడ్డా వే­సు­కొ­ని మద్యం సే­విం­చి భయ­బ్రాం­తు­ల­కు గురి చే­స్తు­న్న­ట్టు హై­డ్రా­కు ఫి­ర్యా­దు­లు వచ్చా­యి. అనేక ని­వాస ప్రాం­తా­ల­కు తా­గు­నీ­రు అం­దిం­చేం­దు­కు వా­ట­ర్ రి­జ­ర్వా­య­ర్ ని­ర్మిం­చా­ల­ని జల­మం­డ­లి ప్ర­య­త్నా­ల­ను కూడా పా­ర్థ­సా­ర­థి అడ్డు­కు­న్నా­రు. ఇన్ని వి­ధా­లు­గా ఇబ్బం­ది పె­డు­తు­న్న పా­ర్థ­సా­ర­థి, కబ్జా­కు గు­రైన భూమి గు­రిం­చి హై­డ్రా­కు ఫి­ర్యా­దు చే­సిన జల­మం­డ­లి, రె­వె­న్యూ అధి­కా­రు­లు ఫి­ర్యా­దు చే­శా­రు. దీం­తో రం­గం­లో­కి ది­గిన హై­డ్రా కబ్జా­దా­రు­ల­ను పరు­గు­లు పె­ట్టిం­చిం­ది. అక్కడ ఆక్ర­మ­ణ­లు తొ­ల­గిం­చి భూ­మి­ని అధి­కా­రు­ల­కు అప్ప­గిం­చిం­ది. ఫేక్ సర్వే నం­బ­ర్ (403/52)తో ప్ర­భు­త్వ భూమి కొ­ట్టే­సే ప్ర­య­త్నం చే­సిన పా­ర్థ­సా­ర­థి­పై కే­సు­లు పె­ట్టిం­ది. పా­ర్థ­సా­ర­ధి­పై బం­జా­రా­హి­ల్స్ పో­లీ­స్ స్టే­ష­న్‌­లో 4 క్రి­మి­న­ల్‌­ను  రె­వె­న్యూ, జల­మం­డ­లి­తో పె­ట్టిం­చిం­ది. ఐదు ఎక­రాల చు­ట్టూ కూడా ఫెం­క్ష­న్‌­ను ఏర్పా­టు చేసి ప్ర­భు­త్వ భూ­మి­గా పే­ర్కొం­టూ బో­ర్డు­ల­ను ఏర్పా­టు చే­సిం­ది.

Tags:    

Similar News