Hydra : మూసీ పరీవాహ అక్రమ కట్టడాల కూల్చివేతకు హైడ్రా రెడీ

Update: 2024-09-19 15:00 GMT

తెలంగాణలో హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏంటి? మళ్లీ కూల్చివేతలు ఎప్పుడు? ఏయే ప్రాంతాలపై హైడ్రా దృష్టి పెట్టింది? ఈసారి 5 మూసీ ఆక్రమణలను టార్గెట్ చేసిందా? రెవిన్యూ అధికారులు ఆక్రమణదారులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారా? అంటే ఔననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

రేవంత్రెడ్డి సర్కార్ మానస పుత్రికగా మూసీ అభివృద్ధి ప్రాజెక్టును ప్రజా ప్రభుత్వం తొలినుంచీ చెబుతోంది. ఇప్పుడీ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి తెర వెనుక పనులు చకచకా జరిగిపోతున్నాయి. గడిచిన కొన్నేళ్లగా మూసీ కెనాల్ కు ఇరువైపులా అక్రమ కట్టడాలు భారీగా వెలిశాయి. కాలువను కుదించిమరీ అక్రమ కట్టడాలు కట్టేశారు కబ్జాదారులు.

పెద్దపెద్ద భవనాలు వెలిశాయి. గడిచిన వారం రోజులుగా రెవిన్యూ అధికారులు మూసీ ఆక్రమణలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. పలు ప్రాంతాల్లో సర్వే కూడా చేశారు. ఈ క్రమంలోనే అక్రమణదారులకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Tags:    

Similar News