Harish Rao : సీఎం నిర్ణయాలకు ఐఏఎస్లు బలి కావొద్దు : హరీశ్ రావు

Update: 2025-04-11 09:15 GMT

సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలతో ఐఏఎస్లుగా పనిచేస్తున్న అధికారులు భాగస్వామ్యం అయి భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. తన ఇంట్లో ఉన్న ఐదు చెట్లను కొట్టేసిన ఐఏఎస్ కు జైలుకు వెళ్లారని, మీరు అనవసరంగా బలి కావద్దన్నారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని పరిశీలించేందుకు పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికారిక కమిటీ హెచ్సీయూను సందర్శించి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, హరీశ్ రావు నేతృత్వంలోని బృందం కమిటీతో భేటీ అయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో డా క్యుమెంట్లు, విజువల్ తో కూడిన నివేదికను బీఆర్ఎస్ నాయకులు కమిటీకి అందించారు. అనంతరం తెలంగాణ భవన్లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.. కంచే చేను మేసినట్లుగా ప్రభుత్వమే వేలాది ఎకరాలను కొట్టేస్తోందన్నారు. వేలాది చెట్లను ధ్వంసం చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఆయన ప్రశ్నించారు.' 50 బుల్డోజర్లతో చెట్లను ఊచకోత కోస్తుంటే అధికారులు నిద్రపోతున్నారా? ఒక్క జింకను చంపింనందుకు సల్మాన్ ఖాన్ ను జైలులో పెట్టారు. ప్రభుత్వ చర్యలతో 3 జింకులు చనిపోయాయి. జింకల చావుకు సీఎం రేవంత్ కారణం కాదా? ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు, మార్గదర్శకాలు, నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ.. వాటిని పట్టించుకోకుండా ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి గతేడాది నవంబర్ 22న రూ.10వేల కోట్లు రుణం తెచ్చారు. రుణం ఇప్పించిన మధ్యవర్తికి రూ.170 కోట్లు లంచం ఇచ్చారు. మధ్యవర్తికి ఇచ్చిన డబ్బు విషయాన్ని సాక్షాత్తూ అసెంబ్లీలోనే చెప్పారు. ఫార్మాసిటీ కోసం 14వేల ఎకరాలు సేకరించారు కదా.. దానిని అభివృద్ధి చేయండి. కంచ గచ్చిబౌలి భూములు హెచ్సీయూ వే. 2012లోనే సీసీఎల్ ఏకు అప్పటి కలెక్టరేఖ రాశారు. ' అని హరీష్ అన్నారు.

Tags:    

Similar News