HYDRA : నా ఇల్లు చెరువులో ఉంటే కూల్చేయండి.. మంత్రి పొంగులేటి

Update: 2024-08-23 14:30 GMT

సామాన్య ప్రజలు మోసపోవద్దనే హైడ్రా ఏర్పాటు చేశామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకూడదని హైడ్రా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. మాజీ మంత్రుల బంధువులు ఎఫ్‌టీఎల్‌లో ఫామ్‌ హౌస్‌లు కట్టారని ఆరోపించారు.

హైడ్రా చైర్మన్ రంగనాథ్ రేపు వెళతారా ఎల్లుండి వెళతారా వెళ్ళండి .. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావును తీసుకుని వెళ్ళండి.. తన ఇంటి ఒక్క ఇటుక బఫర్ జోన్‌లో ఉన్నా కూల్చేయాలన్నారు... లేకపోతే తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ఛాలెంజ్ చేశారు.. తాను అక్కడికి రానని.. ఒక్క ఇటుక బఫర్ జోన్‌లో ఉన్నా కూల్చేయాలని తాను అడ్డు రానని పొంగులేటి స్పష్టం చేశారు.

Tags:    

Similar News