బ్రేకింగ్.. ఎల్బీనగర్ కామినేని నుంచి మెట్రో రైల్‌లో గుండె తరలింపు
నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ ఆస్పత్రికి హైస్పీడ్ మెట్రోలో హార్ట్ తరలించనున్నారు.;
అరుదైన శస్త్రచికిత్స కోసం హైదరాబాద్ మెట్రో రైల్‌కు ప్రత్యేక గ్రీన్‌ఛానెల్ ఏర్పాటు చేశారు. గుండె మార్పిడి చికిత్సలో భాగంగా ఎల్బీనగర్ నాగోల్ నుంచి గుండెను తీసుకుని.. జూబ్లీహిల్స్ మెట్రోస్టేషన్ వరకూ తీసుకువచ్చేందుకు నాన్‌స్టాప్‌గా గ్రీన్‌ఛానెల్ ఏర్పాటు చేశారు. రోడ్డు మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో ఆ ఇబ్బంది లేకుండా మెట్రో మార్గాన్ని ఉపయోగించుకుంటున్నారు.
ఆస్పత్రి వర్గాల విజ్ఞప్తితో నాన్‌స్టాప్ మెట్రో నడిపేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి హార్ట్‌ను తీసుకుని వైద్యుల బృందం అపోలోకి వెళ్లనుంది. నల్గొండకు చెందిన 45 ఏళ్ల రైతు బ్రెయిన్‌డెడ్ కావడంతో అతని గుండెను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. దీంతో.. ఈ గుండె మార్పిడి చికిత్స కోసం ఆ హార్ట్‌ను జుబ్లీహిల్స్ అపోలోకి తీసుకురానున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌కి చెందిన రైతు నర్సిరెడ్డికి 45 ఏళ్లు. ఆదివారం హైబీపీతో ఆయన ఎల్బీనగర్ కామినేనిలో చేరారు. వైద్యులు అతన్ని కాపాడే ప్రయత్నం చేసినా పరిస్థితి విషమించడంతో బ్రెయిన్‌డెడ్ అయినట్టు చెప్పేశారు. ఈ పరిస్థితుల్లో అవయవదానం ద్వారా నలుగురి జీవితాల్లో వెలుగులు నింపొచ్చన్న వైద్యుల సూచనకు ఆ కుటుంబ సభ్యులు అంగీకరించారు. దీంతో.. నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ ఆస్పత్రికి హైస్పీడ్ మెట్రోలో హార్ట్ తరలించనున్నారు.