హైదరాబాద్‌లో త్వరలో ఎంఎంటీఎస్ రైళ్లు పునః ప్రారంభం : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైలు సేవలు వచ్చే వారంలో తిరిగి ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వశాఖ నిర్ణయించినట్లు కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.;
హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైలు సేవలు వచ్చే వారంలో తిరిగి ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వశాఖ నిర్ణయించినట్లు కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. లాక్‌డౌన్‌తో ఆగిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు ఏడాదిన్నర గడిచినా పట్టాలెక్కలేదు. దీంతో చిరువ్యాపారులు, ఉద్యోగులు, కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎంఎంటీఎస్ రైళ్ల పునః ప్రారంభంతో... సామాన్యులకు చవకైన, సురక్షితమైన రవాణా సౌకర్యం లభిస్తుందన్నారు కిషన్‌రెడ్డి. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయన్నారు. ఎంఎంటీఎస్ తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు పాటించాలన్నారు. తన విజ్ఞప్తిని మన్నించి ఎంఎంటీఎస్ సేవలను తిరిగి ప్రాంరభించేందుకు అంగీకరించిన రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు.. కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.