Sriram Sagar Project : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి

Update: 2024-07-27 08:00 GMT

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన మహారాష్ట్ర, SRSP క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షం కురుస్తుండటంతో ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. 4 రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి 30 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,090 అడుగులకు గాను ప్రస్తుతం 1,073.70 అడుగులకు చేరింది.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ 80 టీఎంసీలు. ప్రస్తుతం 30.153 టీఎంసీలకు చేరుకుంది.

Tags:    

Similar News