79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా TGO సంఘం కేంద్ర కార్యాలయంలో అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావానికి తెలంగాణ ఉద్యోగులు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని బాబాసాహెబ్ అంబెడ్కర్ రచించిన రాజ్యాంగంలోని (3) వ అధికారణ ఆధారంగా జయశంకర్సార్ ఉద్యమ స్పూర్తితో తెలంగాణ సాధించుకున్నామని కాని గత 10 సం॥రాలలో తెలంగాణ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలియజేశారు. తెలంగాణ ఉద్యోగుల హక్కులకోసం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అనునిత్యం ముందు ఉంటుందని తెలియజేస్తూ గెజిటెడ్ ఆఫీసర్స్, ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, జేఎసి గా ఏర్పడడం జరిగిందని ఈ జేఏసి లో జనరల్ సెక్రటరీగా టిజీఒ సంఘం ఉందని జేఏసి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షర్లు హక్కుల కోసవ నిరంతరం కృషి చేస్తుందని అలాగే ఉద్యోగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు చిత్తశుద్ధితో చేరవేసి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలియచేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి : ఎ. సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షులు: శ్యామ్, పాల్గోన్నారు.