CM Revanth : యుద్ధంలో మోడీ కంటే ఇందిర బెటర్.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
పహల్గాం ఘటన తర్వాత ప్రధాని అంటే ఇందిరాగాంధీలా ఉండాలనే చర్చ వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆమె గతంలో పాకిస్థాన్‌తో యుద్ధం చేసి ఆ దేశాన్ని రెండు ముక్కలు చేశారని గుర్తు చేశారు. 50 ఏళ్ల తర్వాత ఇందిరాగాంధీ పేరు చెప్పుకొంటున్నామని తెలిపారు. దేశానికి స్వేచ్ఛనిచ్చిందే కాంగ్రెస్. అందరికీ భూములు ఇచ్చి ఆత్మగౌరవం నింపాలన్నది తమ పార్టీ నినాదం అన్నారు. ప్రతి ఆదివాసీ గుండెల్లో ఇందిరమ్మ ఉంటుందన్నారు సీఎం రేవంత్.
నల్లమల్ల పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం, రైతులు సుభిక్షంగా ఉండాలని భగవంతుని ప్రార్ధించినట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు.