భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓరుగంటి వీరయ్య భవన్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల సీనియర్ నాయకుడు ఓరుగంటి రమేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియను వివాదాస్పదం చేస్తూ సోషల్ మీడియా వేదికగా గందరగోళం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నాయకుల తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పా రదర్శకంగా జరుగుతోంది. అర్హత కలిగిన నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. ఇందులో బిఆర్ఎస్ పార్టీకి చెందిన అర్హులైన కార్యకర్తలు కూడా జాబితాలో ఉన్నారు. అయినప్పటికీ కావాలనే తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. గతంలో అధికారం లో ఉన్నపుడు ఒక్క ఇల్లు ఇవ్వలేని నాయకులు, ఇప్పుడు వేల ఇళ్లు మంజూరవుతున్న దృష్ట్యా ఓర్చుకోలేక ఇలాంటి ప్రచారానికి తెగబడుతున్నారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో దళిత బంధు, కార్పొరేషన్ లోన్స్ వంటి పథకాలు కూడా కేవలం తమ సొంత కార్యకర్తలకే పరిమితం చేశారని, లబ్ధిదారుల ఎంపికలో కాంట్రిబ్యూష నే పేరుతో డబ్బులు వసూలు చేసిన వాస్తవాలను గుర్తు చేశారు. ఇలాంటి నాయకులకు ఇప్పటి ఇళ్ల పంపిణీపై విమర్శించే నైతిక హక్కే లేదు అని స్పష్టం చేశారు.ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నియోజకవర్గానికి తొలి విడతలో నాలుగు వేల ఇళ్లు మంజూరయ్యాయని, రాబోయే రోజుల్లో మరోనాలుగు విడతల్లో సుమారు 12 వేల ఇళ్లు అందుబా టులోకి రానున్నాయని తెలిపారు. ఇల్లు లేని ప్రతి అర్హుడికీ గడచిన పదేళ్లలో న్యాయం జరగలేదని, కాంగ్రెస్ పాలనలో ఆ న్యాయం జరగనుంది. అం దువల్ల అందరూ ఓర్పుతో వేచి ఉండాలి అని పిలుపునిచ్చారు.c