TG : రేపటినుంచే ఇంటర్ పరీక్షలు.. ఇవి గుర్తుంచుకోండి

Update: 2025-03-04 09:15 GMT

ఇంటర్ వార్షిక పరీక్షలు రేపటి నుంచి (మార్చి 5) ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఇంటర్ బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది. బుధవారం ప్రారంభమయ్యే పరీక్షలు 25వ తేదీ వరకు జరుగుతాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. బోర్డు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు పరీక్షకేంద్రాలకు 8:45 లోపు చేరుకోవాలి. 9.05 నిమిషాల తర్వాత అనుమతించేది లేదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,96,971 విద్యార్థులు 1,532 పరీక్షా కేంద్రాలలో పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. ఫస్ట్ ఇయర్ 4,88,448 మంది, సెకండ్ ఇయర్ 5,05,523 మంది పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. 1,532 మంది సిబ్బంది, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ లు విధుల్లో ఉండనున్నారు.

Tags:    

Similar News