TG : ఇంటర్ విద్యార్థులు, పేరెంట్స్ ఈ నంబర్ సేవ్ చేసుకోండి..

Update: 2025-04-22 15:00 GMT

ఇంటర్ పరీక్షల్లో ఫస్టియర్‌ రెగ్యులర్‌లో 66.89%, వొకేషనల్‌లో 57.68% మంది పాసైనట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సెకండ్ ఇయర్ రెగ్యులర్ 71.37%, వొకేషనల్‌లో 67.44% విద్యార్థులు పాసయ్యారని చెప్పారు. మొదటి సంవత్సరంలో బాలికల్లో 73.83, బాలురులో 57.83 శాతం పాసవ్వగా, ద్వితీయ సంవత్సరంలో బాలికల్లో 74.21, బాలురులో 57.31 శాతం మంది పాసయ్యారని వెల్లడించారు.

ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థుల్లో తల్లిదండ్రులు మనోధైర్యం నింపాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం ఇంటర్ బోర్డు టెలీమానస్‌ 1800 891 4416, 14416 టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తెచ్చింది. ఈ నంబర్లకు కాల్ చేస్తే మానసిక వైద్యులు కౌన్సెలింగ్ ఇస్తారు. ఇక తల్లిదండ్రులు తమ పిల్లల ఆసక్తులను గుర్తించి ప్రోత్సహించాలి. వారికి అండగా నిలబడాలి.

ఇంటర్ రిజల్ట్స్ వచ్చేశాయి. పాసైనవాళ్లు సంబరాలు చేసుకుంటే.. ఫెయిలయ్యామని, మార్కులు తక్కువొచ్చాయని కొందరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఫెయిలైతే జీవితంలో ఓడినట్లు భావించకండి. ఇప్పుడు తప్పితే.. సప్లీ అనే సెకండ్ ఆప్షన్ ఉంది. కానీ, తప్పుడు నిర్ణయం తీసుకుంటే.. మీరే ప్రాణంగా బతికే మీ వాళ్ల జీవితకాలపు కన్నీళ్లకు కారకులవుతారు. తప్పడం తప్పు కాదని గ్రహించి.. సప్లీలో పాసై కాలర్ ఎగరేయండి.

Tags:    

Similar News