Telangana: TSPSC పేపర్ లీక్‌పై విచారణ.. కీలక అంశాలు వెలుగులోకి..
TSPSC పేపర్ లీక్‌పై విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.;
Telangana: TSPSC పేపర్ లీక్‌పై విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఈ పేపర్ లీక్‌లో కేతావత్ రాజేశ్వర్ కీలక పాత్ర పోషించినట్లు నిర్ధారణ అయ్యింది. 3 ఏఈ పేపర్లను రాజేశ్వర్ 40 లక్షల రూపాయలకు అమ్మేశాడు. 25 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్న రాజేశ్వర్... మిగిలిన డబ్బు పరీక్ష ఫలితాల తర్వాత ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. నిందితుల నుంచి పోలీసులు... ఎనమిదిన్నర లక్షలు రికవరీ చేశారు. రేణుకకు పేపర్ లీక్ చేసిన ప్రవీణ్.. నమ్మకమైన వారికే అమ్మాలని సూచించాడు. రేణుకతో 10 లక్షలకు బేరం కుదుర్చుకుని.. అడ్వాన్స్‌గా 5 లక్షలు తీసుకున్నాడు. ఈ విషయాన్ని రేణుక భర్త డాక్యా నాయక్ సమీప బంధువు రాజేశ్వర్‌కు చెప్పాడు. దీంతో.. మధ్యవర్తులు గోపాల్, నీలేష్, ప్రశాంత్, రాజేంద్ర కుమార్‌కు.. రాజేశ్వర్ 40 లక్షలకు విక్రయించాడు. ఇందులో నుంచి మరో 5 లక్షలను డాక్యా.. ప్రవీణ్‌కు ఇచ్చాడు.