ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేశారు.;
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేశారు. ఇంకా ఆరేళ్ల సర్వీసు మిగిలి ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ.. ప్రభుత్వానికి లేఖ రాశారు. దాదాపు 26 ఏళ్ల సుదీర్ఘ ప్రభుత్వ సర్వీసు నుంచి వీఆర్‌ఎస్ తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. ఓ పోలీసు అధికారిగా సేవలు అందించి ప్రవీణ్‌కుమార్ గుర్తింపు తెచ్చుకున్నారు. పేదలకు నాణ్యమైన చదువు అందాలని భావించి, సాంఘిక సంక్షేమ శాఖ బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా భావించి ఆయన్ను ప్రోత్సహించడంతో... సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల్లో సమూల మార్పులు చేశారు. పేదల బిడ్డలు జ్ఞానవంతులు కావాలని సంకల్పించి పూర్తి అంకిత భావంతో పని చేశానని ట్వీట్‌లో పేర్కొన్న ప్రవీణ్‌కుమార్.. సంక్షేమ భవనంలో 9 ఏళ్లు కాలం 9నిమిషాలుగా గడిచిపోయిందని అన్నారు. మరోవైపు పదవీ విరమణ తర్వాత అంబేడ్కర్, పూలె, కాన్షీరాం మార్గంలో నడిచి.... పేదలకు, పీడితులకు అండగా ఉండి..., భావితరాలను కొత్త ప్రపంచంలోకి నడిపించే ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు.