IT Raids : దిల్ రాజు ఇంట్లో సోదాలు.. భార్య తేజస్విని బ్యాంక్‌కు తీసుకెళ్లిన అధికారులు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఉన్న నిర్మాత దిల్ రాజు ఇళ్లలో ఈరోజు ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్‌రాజు ఇళ్లు, ఆఫీసులతో పాటు ఆయన సోదరుడు శిరీష్, కూతురు హన్షిత రెడ్డి ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో విచారణలో భాగంగా ఆయన భార్య తేజస్వినిని అధికారులు బ్యాంకుకు తీసుకెళ్లారు. ఎస్‌వీసీ సంస్థ బ్యాలెన్స్ షీట్లు, ఐటీఆర్ వివరాలను పరిశీలిస్తున్నారు. దిల్ రాజుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. అటు మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయం, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ నివాసాలు, మ్యాంగో మీడియా సంస్థ, సత్య రంగయ్య ఫైనాన్స్, నిర్మాత అభిషేక్ అగర్వాల్‌తో పాటు ఇతర ఫైనాన్స్ కంపెనీలలోనూ ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇలా ఏక కాలంలో ఎనిమిది చోట్ల 65 బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.