శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్ట ర్ యలమంచిలి శ్రీధర్ ఇంట్లో ఐటీ సోదాలు చేపట్టింది. మాదాపూర్ లోని విల్లాలో ఉండే ఆయన నివాసంలో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మాదాపూర్ లోని శ్రీ చైతన్య కార్పొరేట్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ ఆధారంగా రెయిడ్స్ కొనసాగించారు. డైరెక్టర్ శ్రీధర్ ఇంట్లో సైతం పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అటు ఖమ్మంలో ఉన్న మరో డైరెక్టర్ నివాసంలో సైతం ఐటీ అధికారులు సోదాలు చేశారు. సోదాలు కంటిన్యూ
దేశవ్యాప్తంగా శ్రీచైతన్య విద్యాసంస్థలపై రెండో రోజూ ఐటీ రెయిడ్సకంటిన్యూ అవుతున్నా యి. తెలంగాణ, ఏపీతోపాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఏకకాలంలో అధి కారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. హైదరాబా ద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ విద్యాసంస్థల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్లు గు ర్తించారు. అడ్మిషన్లు, ట్యూషన్ ఫీజులు పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తేల్చారు. 5 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకు న్నారు. లావాదేవీల మెయింటెనెన్స్ కోసం ఉప యోగించిన సాఫ్ట్ వేర్ ఆఫీసర్లు పరిశీలించారు. శ్రీ చైతన్య కాలేజీలతో పాటు ట్రస్ట్, ఇతర ప్రైవేట్ కంపెనీల ట్యాక్స్ చెల్లింపులను వెరిఫై చేస్తున్నా రు. మరోవైపు 2020లోనూ శ్రీ చైతన్య కాలేజీల పై ఐటీ రెయిడ్స్ జరిగాయి. గతంలోనూ రూ.11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు.