Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు.. పలు చోట్ల సోదాలు..
Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. 20 బృందాలుగా విడిపోయిన అధికారులు తనిఖీలు చేపట్టారు.;
Hyderabad : హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. 20 బృందాలుగా విడిపోయిన అధికారులు తనిఖీలు చేపట్టారు. గచ్చిబౌలి ఎక్సెల్ కార్యాలయంలో సోదాలు కొసాగుతున్నాయి. బాచుపల్లి, చందానగర్‌లోనూ సోదాలు చేపట్టారు. ఆదాయ పన్ను చెల్లింపుల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉదయం 6 గంటల నుంచే సోదాలు చేపట్టారు ఐటీ అధికారులు.
సంగారెడ్డి జిల్లాలో నాలుగు చోట్ల దాడులు చేపట్టారు. కంది మండలం చేర్యాలలోని ఎక్సెల్ రబ్బర్ కంపెనీ లిమిటెడ్‌లో సోదాలు జరుగుతున్నాయి. బొల్లారం, పాశమైలారంలోని ఎక్సెల్ రబ్బర్ కంపెనీలలో తనిఖీలు చేపట్టారు. పాశమైలారంలోని పొలిమేరాస్ ప్రైవేట్ లిమిటెడ్‌లోనూ సోదాలు జరుగుతున్నాయి.