విద్యార్థుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ‘నిరుద్యోగుల బాధలు మాకు తెలుసు. వారి విజ్ఞప్తి మేరకే గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేశాం. అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. ఏటా డిసెంబర్ 9 నాటికి ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తాం. UPSC తరహాలో TGPSCలో మార్పులు చేపట్టాం’ అని సీఎం ప్రకటించారు.
గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించామని, ప్రస్తుత డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్-2 పరీక్ష వాయిదా వేశామని చెప్పారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని వెల్లడించారు. పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెడుతామన్నారు. ఇక ప్రతీ ఏటా మార్చి నెలలోగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు తెప్పించుకుంటామని చెప్పారు. జూన్ 2లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9లోగా నియామక ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.