J. P. Nadda: రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా

మహబూబాబాద్ లో బీజేపీ జనసభ

Update: 2024-04-29 03:45 GMT

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం తెలంగాణకు రానున్నారు. కొత్తగూడెం, మహబూబాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. 29న ఉదయం 11 గంటలకు కొత్తగూడెంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో నడ్డా ప్రసంగిస్తారు. అనంతరం మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మధ్యాహ్నం 12:30 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. కాగా ఈ సభల అనంతరం జేపీ నడ్డా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని కుత్భుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నిజాంపేటలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షో లో ఆయన పాల్గొంటారు. రోడ్ షో అనంతరం రాత్రి సమయంలో పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై వారితో చర్చించనున్నారు. తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వెళ్తున్న కమలం పార్టీకి ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు.

మరోవైపు ఈ నెల 30న సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం మండలం వెండి గ్రామంలో జరిగే బహిరంగ సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా వస్తున్నారు. అంతేకాకుండా వచ్చే నెల 3వ తేదీన వరంగల్ పార్లమెంట్ పరిధిలోని భువనగిరి, నల్గొండ ఎంపీ సెగ్మెంట్లను కలుపుతూ జరిగే మరో సభలో మోదీ పాల్గొంటారు. 4వ తేదీన మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేట, చేవెళ్ల ఎంపీ నియోజకవర్గం వికారాబాద్‌లో మోదీ ప్రసంగిస్తారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన మే 1న. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గౌలిపురాలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షో నిర్వహిస్తున్నారు. పాతబస్తీలో ఈ రోడ్ షో కొనసాగనుంది. హైదరాబాద్‌లోని లాల్దర్వాజ అమ్మవారి ఆలయం నుంచి సాలిబండ సుధా థియేటర్ వరకు అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు. 

ఆదివారం నాడు పశ్చిమబెంగాల్‌లో మమతాబెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం నిప్పులు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో సందేశ్ కలీ లోని షేక్ షాజహాన్ తరహా సంఘ విద్రోహ శక్తులు ఉన్నారని, ఆయన విమర్శించారు. వారి వల్ల మహిళలకు బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. సందేశ్‌కలీ లోని మహిళలు , వారి భూములను రక్షించడానికి వెళ్లిన దర్యాప్తు సంస్థల సిబ్బందిపై దారుణంగా దాడులు చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.. ఈ పరిస్థితుల్లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌తో స్థానికులకు రక్షణ కల్పిస్తామన్నారు. 

Tags:    

Similar News