బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ తెలంగాణకు రానున్నారు. సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఐటీసీ కాకతీయకు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అక్కడి నుండి హరిత ప్లాజాకు వెళ్తారు. అక్కడ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంపై ఆరా తీయనున్నారు. ఖైరతాబాద్‌లో సభ్యత్వ నమోదు క్యాంపెయిన్‌లో పలువురికి స్వయంగా సభ్యత్వాన్ని ఇవ్వనున్నట్లు పార్టీ నేతులు చెబుతున్నారు. అనంతరం రాత్రికి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.