JUBLEEHILLS: మరింత వేడెక్కనున్న జూబ్లీహిల్స్ ఉప పోరు
అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం... సిట్టింగ్ స్థానంపై బీఆర్ఎస్ గురి.. గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్.. కోటి ఆశలు పెట్టుకున్న బీజేపీ
తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ ఎస్, బీజేపి కోటి ఆశలు పెట్టుకున్నాయి. భవిష్యత్ వ్యూహాలకు ఈ ఫలితాలే ఊతం కాబోతున్నాయి. ఇక్కడ గెలుపు లెక్కలు రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆయా పార్టీల భవిష్యత్ ను డిసైడ్ చేయబోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ పని తీరుకు కొలమానం కాబోతున్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హోరా హోరీగా సాగుతుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో ప్రధాన పార్టీల నేతలు నువ్వా నేనా అన్నట్టు ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రధానపార్టీలు- కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్ధుల తరఫున ఆయా పార్టీల నాయకులు నియోయజక వర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
రంగంలోకి రేవంత్
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హోరా హోరీగా సాగుతుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో ప్రధాన పార్టీల నేతలు నువ్వా నేనా అన్నట్టు ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రధానపార్టీలు- కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్ధుల తరఫున ఆయా పార్టీల నాయకులు నియోయజక వర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.ఒక సభతోపాటు రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఆయన ఎన్నికల ప్రచారం సినీ కార్మికుల అభినందన సభతో మొదలుకానుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, 24 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో యూసు్‌ఫగూడ పోలీస్ గ్రౌండ్స్‌లో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ జరుగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో సినీ కార్మికులు గణనీయ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో.. ఇక్కడి నుంచే ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే, ఈనెల 31న వెంగళ్‌రావ్‌నగర్, సోమాజీగూడ డివిజన్లలో, నవంబరు 1న బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లు, నవంబరు 4న షేక్‌పేట-1, రహమత్‌నగర్ డివిజన్లు, 5న షేక్‌పేట-2, యూసు్‌ఫగూడ డివిజన్లలో ఆయన రోజుకు గంటపాటు రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఇవన్నీ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమై 8 గంటలకు ముగుస్తాయి. ఇక, కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాన్ని బైక్ ర్యాలీతో ముగించనుంది. ఈనెల 8, 9 తేదీల్లో అన్ని డివిజన్లను కవర్ చేస్తూ ఈ బైక్ ర్యాలీ జరగనుంది. దీని ముగింపు కార్యక్రమంలోనూ రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో సీతక్క
కాలనీల్లో ఇంటింటి ప్రచారం చేస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించాలని, స్థానిక కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలనీ చర్చించినట్లు, పోలింగ్ శాశం పెంచేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.కాగా ఈ ఉదయం మంత్రి సీతక్క నగరంలోని కృష్ణ కాంత్ పార్కులో మార్నింగ్ వాకర్స్ ను కలిసి ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేశారు. స్థానిక వీధి వ్యాపారులతో ముచ్చటించారు.
ఉప ఎన్నికకు బీజేపీ..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపును బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. ఆయనతోపాటు ఆ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా, ప్రచార వ్యూహంపై బీజేపీ సోమవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పార్టీ స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇంటింటి ప్రచారం ముమ్మరం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించడంలో భాగంగా 72 శక్తి కేంద్రాల సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించారు.
ఉధృతంగా బీఆర్ఎస్ ప్రచారం
నోటిఫికేషన్ వెలువడడానికి ముందు నుంచే ప్రచార పర్వంలోకి దిగిన బీఆర్ఎస్.. ఇప్పుడు దానిని మరింత ముమ్మరంచేసింది. ఆ పార్టీ ముఖ్య నాయకులు కేటీఆర్, హరీశ్ రావు గత వారం రోజులుగా నియోజక వర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్ గేటెడ్ కమ్యూనిటీల్లోకి వెళ్లి మరీ సమావేశాలు నిర్వహించి ఓట్లు అడుగుతున్నారు. మంగళవారం కేటీఆర్, హరీశ్ రావు ఆటోల్లో ప్రయాణించి డ్రైవర్ల సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటికే కాలనీలు, బస్తీలను చుట్టేస్తుండగా.. మాజీ మంత్రులు విస్తృత ప్రచారం చేస్తున్నారు.