BJP National Returning Officer : బీజేపీ రిటర్నింగ్ అధికారిగా కె. లక్ష్మణ్
రాజ్యసభ ఎంపీ కె. లక్ష్మణ్‌ను బీజేపీ జాతీయ రిటర్నింగ్ అధికారిగా ఆ పార్టీ నియమించింది. మరి కొద్ది రోజుల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ.. జాతీయ రిటర్నింగ్ ఆఫీసర్లు, కో రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం చేపట్టింది. ఇందులో తెలంగాణ ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో కో రిటర్నింగ్ అధికారులుగా ఎంపీలు నరేష్ బన్సల్, డా. సంబిత్ పాత్రాతో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు రేఖా వర్మ లను నియమించారు. వీరి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.