KTR: కవిత... కన్నవారిని కన్నీళ్లు పెట్టించకు

కవిత పార్టీపై తొలిసారి స్పందించిన కేటీఆర్.. కవిత తన వైఖరి మార్చుకోవాలని హితబోధ.. తల్లిదండ్రులను బాధ పెట్టొదన్న కేటీఆర్

Update: 2026-04-13 03:30 GMT

తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో చర్చ­నీ­యాం­శం­గా మా­రిన కల్వ­కుం­ట్ల కవిత 'కొ­త్త పా­ర్టీ' అం­శం­పై ఆమె సో­ద­రు­డు, బీ­ఆ­ర్ఎ­స్ వర్కిం­గ్ ప్రె­సి­డెం­ట్ కే­టీ­ఆ­ర్ తొ­లి­సా­రి­గా స్పం­దిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా ఆయన చే­సిన వ్యా­ఖ్య­లు కే­వ­లం రా­జ­కీ­యం­గా­నే కా­కుం­డా, కు­టుం­బ­ప­రం­గా­నూ తీ­వ్ర సం­చ­ల­నం రే­పు­తు­న్నా­యి. కవిత వ్య­వ­హా­ర­శై­లి­పై కే­టీ­ఆ­ర్ ఘా­టు­గా స్పం­ది­స్తూ హి­త­వు పలి­కా­రు. "కన్న­వా­రి­ని కవిత ఏడి­పిం­చ­కూ­డ­ద­ని నా సూచన. తల్లి­దం­డ్రు­ల­కు మనం మేలు చే­య­క­పో­యి­నా పర్వా­లే­దు కానీ, వారు బా­ధ­ప­డే పను­లు మా­త్రం అస్స­లు చే­య­కూ­డ­దు. కవిత ప్ర­వ­ర్తన వల్ల తరచూ కు­టుంబ సభ్యు­లు మన­స్తా­పా­ని­కి గు­ర­వు­తు­న్నా­రు. ఇది ఏమా­త్రం సరైన పద్ధ­తి కాదు." అని కే­టీ­ఆ­ర్ ఆవే­దన వ్య­క్తం చే­శా­రు. కవిత చాలా తె­లి­వైన మహిళ, ఆమె­కు రా­జ­కీ­యా­ల­పై మంచి అవ­గా­హన ఉంది. కానీ, ప్ర­స్తుత పరి­స్థి­తు­ల్లో ఆమె ఇలా ప్ర­వ­ర్తిం­చ­డం ఏమా­త్రం కరె­క్ట్ కాదు. ఇక­నై­నా తన వై­ఖ­రి­ని మా­ర్చు­కో­వా­ల­ని కో­రు­కుం­టు­న్నా­ను." అని ఆయన పే­ర్కొ­న్నా­రు. కు­టుం­బం­లో వి­భే­దా­లు పె­రి­గా­యా? ఆ కా­ర­ణం­గా­నే కవిత కొ­త్త దా­రి­ని అన్వే­షి­స్తు­న్నా­రా? అన్న ప్ర­శ్న­లు రా­జ­కీయ వర్గా­ల్లో వి­ని­పి­స్తు­న్నా­యి. సో­ష­ల్ మీ­డి­యా­లో కూడా ఈ వ్యా­ఖ్య­లు వి­స్తృ­తం­గా వై­ర­ల్ అవు­తూ, అనేక ఊహా­గా­నా­ల­కు తె­ర­లే­పు­తు­న్నా­యి. కవిత కొ­త్త పా­ర్టీ పె­ట్ట­బో­తు­న్నా­ర­న్న ఊహా­గా­నాల నే­ప­థ్యం­లో, సొంత సో­ద­రు­డే ఇలాం­టి వ్యా­ఖ్య­లు చే­య­డం రా­జ­కీయ వర్గా­ల్లో పె­ద్ద చర్చ­కు దా­రి­తీ­సిం­ది. కు­టుం­బం­లో అం­త­ర్గ­తం­గా వి­భే­దా­లు ఉన్నా­యా? అం­దు­కే కవిత కొ­త్త దారి వె­తు­క్కుం­టు­న్నా­రా? అన్న ప్ర­శ్న­లు ఇప్పు­డు వె­ల్లు­వె­త్తు­తు­న్నా­యి.

భారత రా­ష్ట్ర సమి­తి­ని మళ్లీ పాత పే­రైన తె­లం­గాణ రా­ష్ట్ర సమి­తి­గా మా­ర్చే అం­శా­న్ని పరి­శీ­లి­స్తు­న్నా­మ­ని తె­లి­పా­రు. పొ­త్తుల రా­జ­కీ­యా­లు తమకు కలి­సి­రా­వ­ని స్ప­ష్టం చే­స్తూ, భవి­ష్య­త్తు­లో స్వ­తం­త్రం­గా ముం­దు­కు వె­ళ్లే ది­శ­గా పా­ర్టీ ఆలో­చి­స్తు­న్న­ట్లు చె­ప్పా­రు. గతం­లో కొ­న్ని తప్పి­దా­లు జరి­గా­య­ని అం­గీ­క­రిం­చిన కే­టీ­ఆ­ర్, ఆ కా­ర­ణం­గా ప్ర­జ­ల­కు మరి­యు నా­య­క­త్వా­ని­కి మధ్య దూరం పె­రి­గిం­ద­ని పే­ర్కొ­న్నా­రు. ఇప్పు­డు ఆ లో­పా­ల­ను సరి­ది­ద్దు­కు­నే ది­శ­గా చర్య­లు తీ­సు­కుం­టు­న్నా­మ­ని తె­లి­పా­రు. మం­చి­ర్యాల జి­ల్లా క్యా­త­న­ప­ల్లి­లో జరి­గిన సమా­వే­శం అనం­త­రం మీ­డి­యా­తో అనౌ­ప­చా­రి­కం­గా మా­ట్లా­డిన కే­టీ­ఆ­ర్, రా­బో­యే రో­జు­ల్లో తమ పా­ర్టీ మళ్లీ బలం­గా ఎదు­గు­తుం­ద­ని ధీమా వ్య­క్తం చే­శా­రు. కే­సీ­ఆ­ర్ మళ్లీ ము­ఖ్య­మం­త్రి­గా అవ­త­రిం­చే అవ­కా­శం ఉం­ద­ని వి­శ్వా­సం వ్య­క్తం చే­శా­రు. రా­ష్ట్రం­లో ప్ర­స్తుత ప్ర­భు­త్వం­పై వి­మ­ర్శ­లు చే­స్తూ, అమలు చే­స్తు­న్న పథ­కాల వి­ష­యం­లో వి­ఫ­ల­మైం­ద­ని ఆరో­పిం­చా­రు. దేశ రా­జ­కీ­యాల ది­శ­గా కూడా ఆయన కొ­న్ని ఆస­క్తి­కర వ్యా­ఖ్య­లు చే­శా­రు. భవి­ష్య­త్తు­లో డీ­లి­మి­టే­ష­న్ కా­ర­ణం­గా తె­లం­గా­ణ­లో అసెం­బ్లీ స్థా­నా­లు, పా­ర్ల­మెం­ట్ స్థా­నా­లు పె­రి­గే అవ­కా­శం ఉం­ద­ని చె­ప్పా­రు. ఇతర రా­ష్ట్రాల పా­ర్టీ­లు తె­లం­గా­ణ­లో ప్ర­వే­శిం­చ­డా­న్ని వ్య­తి­రే­కిం­చ­లే­మ­ని, రా­జ­కీ­యా­ల్లో ఇది సహ­జ­మే­న­ని వ్యా­ఖ్యా­నిం­చా­రు.

Tags:    

Similar News