KA Paul : ఆ ఆఫర్‌ను చూసే రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు : కేఏ పాల్
KA Paul : మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిని గెలిపిస్తే 6 నెలల్లో అభివృద్ధి చేస్తామన్నారు కేఏ పాల్;
KA Paul : మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిని గెలిపిస్తే ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. 25వేల కోట్ల బిజినెస్ ఇస్తామని బీజేపీ పెద్దలు ఆఫర్ చేయడంతో రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు.
మునుగోడు ఉప ఎన్నికలో మూడు ప్రధాన పార్టీలు వేల కోట్లు ఖర్చు పెడతాయన్నారు. ఈసారి ఎన్నికల్లో తాను తెలంగాణలో అసెంబ్లీకి పోటీ చేస్తానని.. ఏపీలో మహిళను సీఎం చేస్తానన్నారు.
బీజేపీని నిధులు అడిగితే జైల్లో పెడతారని సీఎం జగన్ భయపడుతున్నారని విమర్శించారు. తనపై దాడి చేయబోయిన తిరుపతి సీఐ సురేందర్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.