Kaleshwaram Project Report : కాళేశ్వరంపై ఏప్రిల్లో నివేదిక అందించే అవకాశం

Update: 2025-03-25 09:45 GMT

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమి షన్ నివేదిక సిద్ధం చేస్తోంది. ఏప్రిల్ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు కమిషన్ కృషి చేస్తోంది. విచారణలో భాగంగా ఇంజ నీర్లను, చీఫ్ ఇంజనీర్లను, ఈఎన్సీలు, అధికారులు, ఐఏఎస్ స్థాయి అధికారులను దశలవారీగా విచారించి అఫిడవిట్లు తీసుకున్న కమిషన్, ఇప్పుడు నివేదిక రూపకల్పనలో నిమగ్నమైంది. అయితే, ఈప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన నాటి ప్రభుత్వంలోని పెద్దలను విచారించే అంశంపై తుదినిర్ణయం తీసుకోలేదని కమిషన్ స్పష్టం చేసింది. సోమవారం బూర్గుల రామకృష్ణారావు భవన్ లోని కాళేశ్వరం కమిషన్ కార్యాలయంలో చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ అఫిడవిట్లను పరిశీలించారు. నేషనల్ డ్యాంసేఫ్టీ అథారిటీ తుదినివేదిక ఇచ్చినప్పటికీ, ఆ నివేదిక కేంద్ర జలశక్తి ఆధీనంలోనే ఉంది. అయితే సదరు నివేదిక సమర్పించాలని ఎన్డీఎస్ఏ కు కమిషన్ లేఖరాసింది. అలాగే విజిలెన్స్ నివేదికను కూడా జస్టిస్ ఘోష్ పరిశీలిస్తోంది.

Tags:    

Similar News