తెలంగాణ తల్లి ప్రత్యేకతను చెరిపేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి మాయం చేసిన కాంగ్రెస్‌ను క్షమించేది లేదన్నారు. బతుకమ్మ తెలంగాణ తల్లి చేతుల్లో ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తున్న తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి అని దానిని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇదే అంశంపై తెలంగాణ భవన్ లో, గన్ పార్క్, లో అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున నిరసన తెలిపారు.