MLC Kavitha : గ్యాస్ సిలిండర్లు.. యూరియా బస్తాలపై మోడీ ఫోటో పెడతాము : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణలో ఉచిత పథకాలను అడ్డుకుంటోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు;
MLC Kavitha : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణలో ఉచిత పథకాలను అడ్డుకుంటోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో ఆసరా పెన్షన్లను లబ్ధాదారులకు కవిత పంపిణీ చేశారు. సంక్షేమ పథకాల్లో సీఎం కేసీఆర్ ఎన్నడూ వెనక్కి తగ్గలేదని, అర్హతగల వారందరికీ ఆసరా ఫించన్లు అందిస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంట్లో ఇద్దరికి ఆసరా ఫించన్లు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
సంక్షేమ పథకాలను ఉచిత పథకాలంటూ బీజేపీ రాజకీయ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రేషన్ షాపుల్లో ఎక్కడా ఎప్పుడు ప్రధాని మోదీ పోటో పెట్టలేదని.. వంట గ్యాస్ సిలిండర్లు, యూరియా బస్తాలపై మోదీ ఫోటో పెడతామన్నారు. సోషల్ మీడియాలో బీజేపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొడతామన్నారు కవిత.