నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో విజయం సాధించిన కల్వకుంట్ల కవిత.. టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలిశారు. ప్రగతి భవన్‌లో సీఎంను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఎమ్మెల్సీగా గెలిచినందుకు కవితకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలియజేశారు. కవిత వెంట నిజామాబాద్ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు.
నిజామాబాద్ స్థానిక సంస్థళ కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కవిత విజయం తొలిరౌండ్‌లోనే ఖరారైంది. మొత్తం పోలైన ఓట్లు 823 కాగా మొదటి రౌండ్‌లో కవితకు 532 ఓట్లు వచ్చాయి. మొత్తంగా టీఆర్‌ఎస్‌కు 728, బీజేపీ 56, కాంగ్రెస్ 29 ఓట్లు సాధించాయి. మొత్తం 10 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. బీజేపీ, కాంగ్రెస్... డిపాజిట్లు కోల్పోయాయి. అటు.. 14న కవిత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.