KCR: కేసీఆర్, వైఎస్ జగన్ పక్కపక్కనే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ..
KCR: సీఎం కేసీఆర్, జగన్ కలిశారు. జలవివాదం తర్వాత తొలిసారి కలుసుకున్న సీఎంలు;
KCR, Jagan (tv5news.in)
KCR: సీఎం కేసీఆర్, జగన్ కలిశారు. జలవివాదం తర్వాత తొలిసారి కలుసుకున్న సీఎంలు.. పక్కపక్కనే కూర్చుని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఈ సీన్ అంతా తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనువరాలి పెళ్లిలో జరిగింది. శంషాబాద్ లో జరిగిన వివాహవేడుకకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి హాజరయ్యారు సీఎంలు. నూతన దంపతులు స్నిగ్దారెడ్డి, రోహిత్ రెడ్డిలను ఆశీర్వదించారు. పోచారం కుటుంబసభ్యుల్ని దగ్గరుండి సీఎం జగన్ కు పరిచయం చేశారు కేసీఆర్.