KCR: సారొస్తారా..? సవాల్‌కు సై అంటారా..?

వేడెక్కిన తెలంగాణ రాజకీయం... రేవంత్-కేసీఆర్ మాటల యుద్ధం... ఇక నుంచి మరో లెక్క అన్న కేసీఆర్.. కేసీఆర్‌ను పవర్లోకి రానివ్వనన్న రేవంత్

Update: 2025-12-27 04:30 GMT

తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో మళ్లీ వా­గ్వా­దాల వేడి పె­రి­గిం­ది. అధి­కార కాం­గ్రె­స్, ప్ర­తి­ప­క్ష బీ­ఆ­ర్‌­ఎ­స్ మధ్య మాటల యు­ద్ధం రో­జు­రో­జు­కీ ఉధృ­త­మ­వు­తోం­ది. బీ­ఆ­ర్‌­ఎ­స్ అధి­నేత, మాజీ సీఎం కే­సీ­ఆ­ర్ వ్యా­ఖ్య­ల­కు... ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ ఘా­టు­గా స్పం­దిం­చ­డం­తో రా­ష్ట్ర రా­జ­కీయ వా­తా­వ­ర­ణం మరింత ఉద్రి­క్తం­గా మా­రిం­ది. అభి­వృ­ద్ధి, పాలన, గత–ప్ర­స్తుత ప్ర­భు­త్వాల పని­తీ­రు­పై ఒక­రి­పై ఒకరు చే­స్తు­న్న ఆరో­ప­ణ­లు రా­జ­కీయ దు­మా­రం రే­పు­తు­న్నా­యి. అధి­కా­రం­లో­కి వచ్చిన తర్వాత కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం తీ­సు­కుం­టు­న్న ని­ర్ణ­యా­ల­పై కే­సీ­ఆ­ర్ తీ­వ్ర వి­మ­ర్శ­లు చే­స్తుం­డ­గా, వా­టి­కి రే­వం­త్ రె­డ్డి అదే స్థా­యి­లో కౌం­ట­ర్లు ఇస్తు­న్నా­రు. సభలు, మీ­డి­యా సమా­వే­శా­లు, సో­ష­ల్ మీ­డి­యా వే­ది­క­గా సా­గు­తు­న్న ఈ మాటల యు­ద్ధం కే­వ­లం నేతల మధ్య పర­స్పర వి­మ­ర్శ­ల­కే పరి­మి­తం కా­కుం­డా, రా­బో­యే రా­జ­కీయ సమీ­క­ర­ణ­ల­కు సం­కే­తం­గా మా­రు­తోం­ది. అధి­కార–ప్ర­తి­ప­క్షాల మధ్య ఈ ఘర్షణ తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో కొ­త్త అధ్యా­యా­ని­కి నాం­ది పలు­కు­తోం­ద­న్న అభి­ప్రా­యం రా­జ­కీయ వర్గా­ల్లో వి­ని­పి­స్తోం­ది.

రేవంత్ శపథం

“ప్రజల్లోకి వస్తాం, ప్రభుత్వం తోలు తీస్తాం” అని కేసీఆర్, “నేను రాజకీయాల్లో ఉన్నంతవరకు కేసీఆర్, ఆయన కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను. ఇదే నా శపథం” అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. ఈ నేపధ్యంలో సహజంగా తలెత్తుతున్న ప్రశ్న: కేసీఆర్ నిజంగానే ప్రజల్లోకి వచ్చి రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తారా? లేక వ్యూహాత్మక మౌనం కొనసాగిస్తారా? అన్న ప్రశ్న తెలంగాణ రాజకీయాల్లో రచ్చ రేపుతోంది. చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చిన మాజీ కేసీఆర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క’ అంటూ కాంగ్రెస్ సర్కార్‌కి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. డైరెక్ట్ వార్ ప్రకటించారు. రెండేళ్లు ఆగాం. ఇకపై ప్రభుత్వాన్ని అడుగడునా నిలదీస్తా.. తోలు తీస్తామన్నారు. జనంలోకి తానే నేరుగా వస్తానని ప్రకటించారు. కళ్ల ముందు ఇదంతా జరుగుతుంటే మౌనంగా ఉండాలి, ఇష్టానుసారం మాట్లాడుతామంటే కుదరదని కేసీఆర్ రాజకీయ యుద్ధం ప్రకటించారు. ఇది జరిగిన రెండు మూడు రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కుటుంబం కాలకూట విషం. కేసీఆర్, బీఆర్ఎస్ చరిత్ర ఖతమే. ఇక గతమే. బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెసే. 2029లో రెండింట్ల మూడొంతల మెజార్టీతోని కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ ఇదే నా సవాల్ అంటూ విసిరారు. నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను అధికారంలోకి రానివ్వనంటూ శపథం పూనారు.

మారిన రాజకీయ సమీకరణలు

బీ­ఆ­ర్ఎ­స్ పదే­ళ్ళ పాలన తర్వాత కాం­గ్రె­స్ అధి­కా­రం­లో­కి వచ్చిం­ది. దీం­తో తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో సమీ­క­ర­ణ­లు మా­రా­యి. రే­వం­త్ రె­డ్డి తన సహజ రా­జ­కీయ శై­లి­లో బీ­ఆ­ర్ఎ­స్, కే­సీ­ఆ­ర్ పై దూ­కు­డు, వా­గ్దా­డి­ని ప్ర­ధా­నా­స్త్రా­లు­గా సం­ధి­స్తు­న్నా­రు. కే­సీ­ఆ­ర్ పై కు­టుం­బం పాలన, అవి­నీ­తి, అధి­కార దు­ర్వి­ని­యో­గం వంటి తీ­వ్ర ఆరో­ప­ణ­లు చే­స్తు­న్నా­రు. కానీ, కే­సీ­ఆ­ర్.. అధి­కా­రా­న్ని కో­ల్పో­యిన తర్వాత దా­దా­పు మౌ­నం­గా ఉం­టు­న్నా­రు. అసెం­బ్లీ­కి కూడా వె­ళ్ళ­డం లేదు. ఎం­పిక చే­సు­కు­న్న అతి తక్కువ సం­ద­ర్భా­ల్లో మా­త్ర­మే బయ­ట­కు వస్తు­న్నా­రు. మా­ట్లా­డు­తు­న్నా­రు. అయి­తే ఈ మౌనం బల­హీ­న­తా? రా­జ­కీయ వ్యూ­హ­మా? అన్న ప్ర­శ్న­లు ఉత్ప­న్న­మ­వు­తు­న్నా­యి. రే­వం­త్ రె­డ్డి సవా­ళ్ల వె­నుక మా­త్రం స్ప­ష్ట­మైన వ్యూ­హం కని­పి­స్తోం­ది. గత పా­ల­న­ను ని­రం­త­రం ప్ర­శ్నిం­చ­డం ద్వా­రా ప్ర­జా అజెం­డా­ను ని­యం­త్రి­స్తు­న్నా­రు. కాం­గ్రె­స్ పా­ర్టీ­కి, శ్రే­ణు­ల­కు, ప్ర­భు­త్వా­ని­కి నై­తిక బలం కల్పి­స్తు­న్నా­రు. ఇదే సమ­యం­లో బీ­ఆ­ర్ఎ­స్‌­ను ఆత్మ రక్ష­ణ­లో­కి నె­డు­తు­న్నా­రు. కే­సీ­ఆ­ర్‌­ను టా­ర్గె­ట్ చే­స్తూ, బీ­ఆ­ర్ఎ­స్ రా­జ­కీయ వర్త­మా­నా­న్ని, భవి­ష్య­త్తు­ను ని­యం­త్రి­స్తు­న్నా­రు. రే­వం­త్ వ్యా­ఖ్య­ల­పై బీ­ఆ­ర్ఎ­స్ నా­య­క­త్వం స్పం­దిం­చ­క­పో­తే ‘భయ­ప­డు­తు­న్న­ట్లు’, స్పం­ది­స్తే కాం­గ్రె­స్ చె­ప్పే ఆరో­ప­ణల చర్చ మరింత వి­స్త­రిం­చే వ్యూ­హా­న్ని సెట్ చే­సి­న­ట్లు­గా కని­పి­స్తోం­ది. అపర రా­జ­కీయ ని­పు­ణ­డి­గా పే­రు­న్న కే­సీ­ఆ­ర్, ఈ రెం­డిం­టి మధ్య చి­క్కు­కు­న్నా­రా? అనే విశ్లేషణలు జరుగుతున్నాయి.

Tags:    

Similar News