KCR Cabinet: మంగళవారం కేసీఆర్ కేబినెట్ సమావేశం.. ధాన్యం కొనుగోళ్లపై కీలక నిర్ణయం..
KCR Cabinet: రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది.;
KCR Cabinet: రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అటు, ఇవాళ ఢిల్లీ ధర్నాలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి 24 గంటల డెడ్‌లైన్ పెట్టారు కేసీఆర్. కేంద్రమే పూర్తిగా ధాన్యం కొనాలంటూ డిమాండ్ చేశారు. మోదీ, గోయల్‌కు దండం పెట్టి చెబుతున్నా ధాన్యం కొనండి, లేదంటే ఆఖరి నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే రేపు కేబినెట్ సమావేశం అవుతుండడంతో, కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది.