దయ్యాలు ఎవరన్నది కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్సే చెప్పాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆమె సీక్రెట్ గా రాసిన లేఖను తండ్రి, అన్న, బావ ఎవరైనా లీక్ చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆమె రాసిన సీక్రెట్ లేఖ ఎలా బయటికి వచ్చిందనేది అనుమానాస్పదమేనని అన్నారు. మొన్న సోషల్ మీడియాలో లేఖ వైరల్ అయ్యిం దని, నిన్న ఆమె ఫారిన్ నుంచి దిగిందని అన్నారు. కవిత బీజేపీలోకి వస్తానంటే తీసుకునే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లా రాష్ట్రాన్ని దో చుకుంటున్నారని విమర్శించారు. హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. అభివృద్ధికి నిధులు లేవంటూ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రే అవమాన పరుస్తు న్నారని అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా మాట్లాడలేదని అన్నారు. రా ష్ట్రంలో మోదీని ఇష్టం వచ్చినట్టు తిడుతూ.. ఢిల్లీ వెళ్లి నిధులు మంజూరు చేయాలని అడగం ఎంత వరకు కరెక్టని అన్నారు. కేంద్రం డబ్బులతోనే తెలంగాణలో అభివృ ద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు.