Kavitha Counters : కేసీఆర్ మొక్క కాదు...వేగు చుక్క..సీఎంకు కవిత కౌంటర్

Update: 2024-12-03 13:00 GMT

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొక్క అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి... కేసీఆర్ ఒక వేగుచుక్క అని కొనియాడారు. రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్ అని కవిత ప్రశంసించారు. మంగళవారం ఎమ్మెల్సీ కవిత నివాసంలో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోము, ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో నిధులు వరదలయ్యి పారేవి... ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయని కవిత విమర్శించారు. రేవంత్రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్ అని గుర్తు చేశారు.

Tags:    

Similar News