Komatireddy Venkat Reddy : కేసీఆర్ కు మళ్లీ అధికారమొస్తదనే నమ్మకం లేదు

Update: 2024-12-17 05:36 GMT

మాజీ సీఎం కేసీఆర్ కు మళ్లీ అధికారం వస్తుందనే నమ్మకం లేదని, అందుకే అసెంబ్లీకి రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇవాళ అసెంబ్లీ లాబీల్లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కొడుకు, అల్లుడు, బిడ్డలను కేసీఆర్ పట్టించుకోరని చెప్పారు. ఐదుగురు ఎమ్మెల్యే లు ఉన్నప్పుడు భట్టి విక్రమార్క క్రమం తప్ప కుండా అసెంబ్లీకి వచ్చారని గుర్తు చేశారు. ప్రతి పక్ష హోదా లేకున్నా ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి పార్లమెంటుకు వెళ్లారని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని అన్నారు. ప్రజా స్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని చెప్పారు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లాంటి వారే ఓడిపోయారని గుర్తు చేశారు. తనను ఓడించేందుకు బూర నర్సయ్య గౌడ్ 80 కోట్లు ఖర్చు పెట్టారని, అయినా తానే గెలిచానని గుర్తు చేశారు. ప్రతిపక్ష ఎంపీగా ఉండి ఎన్నో రోడ్డు ప్రాజెక్టులు తెచ్చినట్టు ఆయన వి వరించారు. కాంగ్రెస్ లో మంత్రి వర్గ విస్తరణ, ఎవరికి పదవులు అనేది చెప్పలేమని, అధిష్టానం, ముఖ్యమంత్రే ఫైనల్ చేస్తారని అన్నారు. పాలమూరు నుంచి వచ్చిన శ్రీహరికి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అన్నారు. జమిలీ డ్రాఫ్ట్ రెడీ అయ్యిందని మంత్రి అన్నారు. డీలి మిటేషన్ జరిగితే రాష్ట్రంలో 34 ఎమ్మెల్యే 7 ఎంపీ సీట్లు పెరుగుతాయని చెప్పారు.

Tags:    

Similar News