KCR: ఉత్తరప్రదేశ్, కేరళ వెళ్లనున్న సీఎం కేసీఆర్.. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు ఏర్పాట్లు..
KCR:బీజేపికి జాతీయ స్థాయిలో వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టి మూడో ఫ్రంట్ ఏర్పాటు దిశగా కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు;
KCR: బీజేపికి జాతీయ స్థాయిలో వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టి మూడో ఫ్రంట్ ఏర్పాటు దిశగా గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం వైద్య చికిత్స కోసం ఢిల్లీలో ఉన్న కేసీఆర్.. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేసీఆర్ త్వరలోనే ఉత్తరప్రదేశ్, కేరళ వెళ్లనున్నట్లు పేర్కొన్నాయి.బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగానే సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో కేసీఆర్ కలవనున్నట్లు తెలిపాయి.
కేసీఆర్ కంటే ముందే అఖిలేష్‌తో కవిత భేటీ కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేసీఆర్ వెంట ఢిల్లీలో ఉన్న కవిత... గతంలో మహారాష్ట్ర, జార్ఖండ్‌కు గులాబీ బాస్ వెళ్లినపుడూ కూడా వెన్నంటే ఉన్నారు. ఇటీవలికాలంలో కేసీఆర్, టీఆర్‌ఎస్ తరపున జాతీయ రాజకీయాల్లో ఇతర పార్టీలతో సమన్వయ బాధ్యత వ్యవహారాల్లో ఎమ్మెల్సీ కవిత కీలకంగా వ్యవహరిస్తున్నారు. కవిత సూచనల మేరకే దేశ రాజధానిలో విస్తృత సంబంధాలు ఉన్న సంజయ్ కుమార్ ఝా ను కేసీఆర్‌కు ఢిల్లీలో ప్రజాసంబంధాల అధికారిగా నియామకం జరిగింది.