KCR National Party : ఇంకా వీడని ఉత్కంఠ.. దసరా రోజే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటిస్తారా..?

KCR National Party : తెలంగాణ సీఎం కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్‌లోకి ఎంటరై సత్తా చాటాలని ముచ్చట పడుతున్నారు;

Update: 2022-09-29 11:30 GMT

KCR National Party : తెలంగాణ సీఎం కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్‌లోకి ఎంటరై సత్తా చాటాలని ముచ్చట పడుతున్నారు. దసరా పండుగ రోజున కొత్త జాతీయ పార్టీని ప్రకటించేందుకు కేసీఆర్ కసరత్తు పూర్తయింది. ఇందుకోసం ఏడాదికాలంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలతో ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ బీజేపీలకు సమదూరం పాటిస్తూ దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ జెండా రూపకల్పనపై ఫోకస్ పెట్టారు.

ఇక తను అనుకున్న లక్ష్యం కోసం వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీ అధినేతలతో దోస్తీ కట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్‌.... తన ఎజెండాను ప్రాంతీయ పార్టీ అధినేతలకు వివరించారు కేసీఆర్. అయితే.. కేసీఆర్ కలిసిన నేతలంతా బీజేపీపై పోరాటానికి సై అంటోన్నా...... కాంగ్రెస్ లేకుండా ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కూటమి మధ్యే పోటీయేనని.. ధర్డ్ ఫ్రంట్.. ఫస్ట్ ఫ్రంట్ అనేవి ఉండవని ఓ పక్క బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తేల్చి చెబుతున్నారు. తాను కాంగ్రెస్ కూటమిలో భాగమని ప్రకటించేశారు నితీష్‌. మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ కూటమి వైపు చూస్తోందన్న ప్రచారం జరుగుతోంది. హర్యానాలో ఓ వైపు విపక్ష పార్టీల బహిరంగసభ జరుగుతున్న సమయంలో నితీష్ ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల కేసీఆర్ బీహార్ వెళ్లి మరీ నితీష్ కుమార్‌తో సమావేశమయ్యారు. కొత్త ప్రాంతీయ పార్టీ, ఫ్రంట్ గురించి చర్చించినట్లుగా ప్రచారం జరిగింది. దేశానికి ప్రత్యామ్నాయం అవసరం అన్నారు.. కలసి పోరాడతామని చెప్పారు. కానీ బిహార్‌లో కాంగ్రెస్‌, జేడీయూతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంతో ఇప్పుడు కేసీఆర్ తో కలిసి పనిచేసే పరిస్థితి లేదన్న టాక్ వినిపిస్తోంది. నితీష్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌తో ఉంటాననే సంకేతాలు ఇచ్చారు.

ప్రస్తుతం దేశంలో రాజకీయ పార్టీలన్నీ బీజేపి అనుకూల...వ్యతిరేక పార్టీలుగా చీలిపోయాయి. బీజేపీ చేస్తున్న రాజకీయాలకు తలొగ్గి కొన్ని పార్టీలు పొత్తులు పెట్టుకోకపోయినా ఆ పార్టీతో కలిసి పనిచేస్తున్నాయి. కొన్ని చోట్ల బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తోనే ఉన్నాయి.

నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, స్టాలిన్, శరద్ పవార్, హేమంత్ సోరేన్,అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే తో పాటు మమత బెనర్జీ కూడా కాంగ్రెస్ తోనే కలిసి నడిచే అవకాశాలు అన్నాయి. జాతీయస్థాయిలో ఎవరు ప్రయత్నాలు చేసినe... కాంగ్రెస్ తో కలిసి నడవాల్సిన పరిస్థితి తప్పదన్న చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో .. జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు వర్కటవుతాయన్న చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News