KCR : కేటీఆర్, హరీశ్‌తో కేసీఆర్ మీటింగ్... కవిత, మల్లన్న ఇష్యుపై చర్చలు

Update: 2025-07-14 13:15 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావులతో భేటీ అయ్యారు. నందినగర్‌ లోని ఆయన నివాసంలో ఈ భేటీ సాగుతుంది. తెలంగాణ జాగృతి నేతలు నిన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ కవిత పై మల్లన్న చేసిన ఆరోపణలకు వ్యతిరేకంగా జాగృతి నేతలు ఈ దాడికి పాల్పడ్డారు. అయితే ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా పార్టీ కీలక నేతలు కేటీఆర్ ,హరీష్ రావు లతో కేసీఆర్ సమావేశం అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత వ్యవహారంలో ఎలా స్పందించాలనే అంశంపై వారు చర్చించుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా పార్టీ వ్యవహారాలతో కవిత ఆంటిముట్టనట్లుగా ఉన్న నేపథ్యంలో కవిత, మల్లన్న ఇష్యూపై ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారని దానిపై పొలిటికల్ సర్కిల్లో ఆసక్తి నెలకొంది.

మరోవైపు మల్లన్న తన విమర్శల డోస్ పెంచారు. తన ఛానెల్లోని ప్రోగ్రామ్‌లో కవిత పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంచం పొత్తు-మంచం పొత్తు అనేది తెలంగాణలోని వాడుక భాషలో కామన్ అని అన్నారు. 2017 లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగు అకాడమీ ఈ సామెత ను ప్రస్తావించిందని. అప్పటి సీఎం కేసీఆర్ పుస్తకం లో సందేశం కూడా రాశారని మల్లన్న పేర్కొన్నారు. ఈ పదం తెలంగాణలో ఉందో లేదో కవిత వెళ్లి తన తండ్రిని అడిగి తెలుసుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యవహారం మళ్లీ రాజుకునేలా కనిపిస్తోంది. మరి కెసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News