CM Revanth Reddy : 15 నెలలుగా కేసీఆర్ కు 57 లక్షల జీతం : సీఎం రేవంత్ రెడ్డి

Update: 2025-03-15 12:00 GMT

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, గజ్వేల్ ఎమ్మెల్యే హోదాలో 15 నెలల వ్యవధి కేవలం రెండు సార్లే అసెంబ్లీకి హాజరయ్యా రు. ఇందుకు గాను ఆయనకు ప్రభుత్వం 57,84,124 జీతం ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. ఇంకా తాను సెక్యూరిటీ లెక్కల జోలికి వెళ్లడం లేదని అన్నారు. ఆయనకు ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచే ముప్పు ఉందని, సెక్యూరిటీ లెక్కలు కలిపితే ఇంకా ఎక్కువే అవుతాయని అన్నారు. తాను అనని మాటలు అన్నట్టు కేటీఆర్, హరీశ్ రావు ప్రచారం చేస్తున్నారని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మార్చురీకి పంపారని అన్నానంటూ క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ వందేళ్లు ఆయురారోగ్యాలతో బతకాలని కోరుకుంటున్న ట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన ప్రతిపక్ష నా యకుడిగా ఉండాలని, ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కూడా కోరుకుంటున్నట్టు చెప్పారు. మాట్లాడితే బీఆర్ఎస్ నాయకులు స్టేచర్ స్టేచర్ అంటున్నా రని.. మీ స్టేచర్ కన్నా తెలంగాణ ఫ్యూచర్ ముఖ్యమని అన్నారు. రాష్ట్రంలో పంటలు ఎండినా, ఎవరైనా చచ్చిపోయినా తండ్రి, కొడుకు, మామా అల్లుండ్లు కలిసి డ్యాన్సులు చేస్తుండ్రని అన్నారు. వాళ్ల కండ్లలో పైశాచిక ఆనందం కని పిస్తోందని విమర్శించారు. ఉగాండా ప్రెసిడెంట్ ఈడీ అమీన్ అనే నర రూప రాక్షసుడితో వీళ్లు పోటీ పడుతున్నారని అన్నారు. మీరు పార్టీ పెట్టి 25 ఏండైంది.. మిమ్మల్ని ఆదరించి అక్కున చేర్చుకున్నది తెలంగాణ అని, ఇప్పుడు మీకు టైం అయిపోయిందని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే ప్రజలే తప్పు చేశారన్నట్టు, వాళ్లను ఉరి తీయాలన్నట్టు మాట్లాడితే ఎలా..? అని ప్రశ్నించారు. ప్రజలు కూడా 2022 నుంచి తమ నిరసన వివిధ రూపాల్లో తెలుపుతూ ఉన్నా.. వీళ్ల ఆగడాలు తగ్గలేదని, అందుకే తమకు అధికారం కట్టబెట్టారని అన్నారు.

Tags:    

Similar News