Vijayashanthi : ప్రాజెక్టులపై కేసీఆర్ ఏడు లక్షల కోట్ల స్కామ్ : విజయశాంతి
కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని విమర్శించారు ఎమ్మెల్సీ విజయశాంతి. ప్రాజెక్టుల ద్వారా కేసీఆర్ కుటుంబ కమీషన్లను తీసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం దోచుకున్న సొమ్ము ప్రభుత్వం రికవరీ చేస్తే..ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అన్నీ అమలు చేయవచ్చన్నారు. అసెంబ్లీకి వస్తే, కాంగ్రెస్ సభ్యులు ఈ విషయంపై నిలదీస్తారనే భయంతో.. తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతి అన్నట్లు కేసీఆర్ వైఖరి ఉందన్నారు ఎమ్మెల్సీ విజయశాంతి.