బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ( KCR ) బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేడు అసెంబ్లీకి రానున్నారు. గాయం కారణంగా గత సమావేశాలకు గైర్హాజరయ్యారు. కాగా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు వచ్చి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పలుమార్లు చెప్పింది. అటు తమ బాస్ సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే చూడాలని బీఆర్ఎస్ అభిమానులూ వేచి చూస్తున్నారు. మొత్తానికి ఈరోజు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఆసక్తికరంగా సాగనున్నాయి.
అసలు అధికార పక్షాన్ని కేసీఆర్ ఏవిధంగా ఎదుర్కొంటారనే దానిపైనే ప్రస్తుతం చర్చ నడుస్తోంది. బడ్జెట్ సెషన్స్ రోజు కేసీఆర్ హాజరవడంతో అసలు మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారో, ఆయనకు మైక్ ఇస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. పదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు సడెన్గా ప్రతిపక్షంలో కూర్చోవడంతో అసలు ఆయన సభలో ఉంటారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాలి.