KCR Press Meet: వదల బీజేపీ వదల.. వెంటాడుతాం, వేటాడుతాం: కేసీఆర్
KCR Press Meet: ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంపై, బీజేపీపై డైరెక్ట్ ఫైట్‌కు రెడీ అయ్యారు గులాబీ బాస్, సీఎం కేసీఆర్.;
KCR Press Meet (tv5news.in)
KCR Press Meet: ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంపై, బీజేపీపై డైరెక్ట్ ఫైట్‌కు రెడీ అయ్యారు గులాబీ బాస్, సీఎం కేసీఆర్. పంజాబ్‌లో లాగా ధాన్యం కొంటారా లేదా తేల్చి చెప్పండంటూ ఆల్టిమేటం జారీచేశారు. 18 తర్వాత రెండు రోజులు వెయిట్ చేస్తాం అంటూ డెడ్‌లైన్ విధించారు. ఆ తర్వాతే బీజేపీని వెంటాడుతాం, వేటాడుతాం.. రైతుల కోసం ఎంతకైనా తెగిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. ఈనెల 18న ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలంతా కలిసి ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తామన్నారు. ఇందిరాపార్క్ ధర్నా తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు గవర్నర్ ను కలుస్తామని వెల్లడించారు.
కొనుగోలు కేంద్రాల దగ్గర సంజయ్ డ్రామాలు మొదలు పెట్టారంటూ కేసీఆర్ మండిపడ్డారు. మంట మీద ఉన్న రైతులు నిలదీస్తే వారి మీద రాళ్లతో దాడులు చేస్తారా అని నిలదీశారు. కొనే దగ్గరకు సంజయ్ వెళ్లడంలో మతలబు ఏంటి అని ప్రశ్నించారు. సంజయ్ వరి వేయమన్నది నిజమా కాదా? క్షమాపణ చెప్పాలన్నారు. రైతుల మీద దాడులను సీరియస్ గా తీసుకుంటామని హెచ్చరించారు.