KCR: కోట్లాది మంది రైతుల తరఫున మోదీకి కేసీఆర్ విన్నపం..
KCR: 12 ఎరువుల ధరల పెంపుపై ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు.;
KCR: 12 ఎరువుల ధరల పెంపుపై ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని, కోట్ల మంది రైతుల తరపున విజ్ఞప్తి చేస్తున్నానని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. రైతు ప్రయోజనాలకు ప్రతికూలంగా ఉన్న కొన్నింటిని ప్రధాని దృష్టికి తీసుకెళ్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆరేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న విషయాన్ని ఫిబ్రవరి 2016లో ప్రకటించిందని గుర్తుచేశారు.
ఇప్పటికీ ఐదేళ్లు గడిచినా నిర్దిష్ట కార్యక్రమం ప్రారంభించలేదన్నారు. ఐదేళ్లలో ఇన్‌పుట్ కాస్ట్‌లు పెరిగి ఆదాయం తగ్గి రైతులను ఇబ్బంది పెడుతున్నాయన్నారు. ఆరేళ్లుగా పెరుగుతున్న ఎరువు ధరలు కళ్ళకు కడుతున్నాయన్నారు. మ్యురియేట్ ఆఫ్ ఫోటాస్ ధరలు 50 శాతం, 100 శాతం కంటే ఎక్కువ పెరగడం విచారకరమని ఆ లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.
ఇప్పటికే కేంద్రం అనేక రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారని.. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. బీజేపీ కుట్రలను దేశప్రజలు తిప్పికొట్టాలన్నారు. కేంద్రంపై నాగళ్లు ఎత్తి తిరగబడితేనే.. వ్యవసాయాన్ని కాపాడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు కేసీఆర్. యూరియా, డీఏపీ వినియోగం తగ్గించాలని రాష్ట్రాలకు చెబుతున్నారని లేఖలో ప్రస్తావించారు.
ఎరువుల ధరలు తగ్గించకపోగా, ఆ భారాన్ని రైతులపై నెడుతున్నారని మండిపడ్డారు.. దేశంలోని కోట్లాది రైతుల పక్షాన చెబుతున్నానని.. ఎరువులు సబ్సిడీపై ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.. రైతుల పెట్టుబడి మొత్తాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని లేఖలో గుర్తు చేశారుకేసీఆర్. అటు ఎరువుల సబ్సిడీ విధానాన్ని రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా మార్చారని మండిపడ్డ కేసీఆర్.. 70 ఏళ్లుగా ఎరువులపై సబ్సిడీ కొనసాగుతోందని గుర్తు చేశారు.. ఇక నరేగాతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన పంపినా ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు కేసీఆర్.