KCR Yadadri Tour : నేడు యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్

KCR Yadadri Tour : బ్రహ్మెత్సవాల్లో భాగంగా లక్ష్మీనారసింహుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. ప్రభుత్వం తరుపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు సీఎం కేసీఆర్.

Update: 2022-03-11 01:30 GMT

KCR Yadadri Tour :తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రిలో పర్యటించనున్నారు. బ్రహ్మెత్సవాల్లో భాగంగా లక్ష్మీనారసింహుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. ప్రభుత్వం తరుపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు సీఎం కేసీఆర్. అనంతరం మహాసుదర్శన యాగ స్థలం, అన్నదానం కాంప్లెక్స్‌, సత్యనారాయణ వ్రతాలు, దీక్షాపరుల మండపాలు, బస్టాండ్‌ పనులను సీఎం పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఆలయ ప్రారంభానికి సమయం సమీస్తున్న వేళ.. సీఎం కేసీఆర్ యాదాద్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ప్రధాన ఆలయం పునఃప్రారంభ పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత మహా కుంభ సంప్రోక్షణ, అంకురార్పణపై వేద పండితులతో చర్చిస్తారు. యాగాలు, హోమాలు, పూజలకు కావాల్సిన ఏర్పాట్లతో పాటు యాదాద్రికి వచ్చే భక్తులకు కల్పించే వసతులపైనా సీఎం కేసీఆర్ ఆరా తీయనున్నారు. కాగా..యాదాద్రిలో ఈనెల 21 నుంచి మహాసుదర్శన యాగం జరగనుంది. ఇందుకు 75 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. 

Tags:    

Similar News