చూస్తుంటే తెలంగాణలో మరో ఉపనిక వచ్చేలా కనిపిస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశం ప్రస్తుతం స్పీకర్ వద్ద ఉంది. ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చినా సరే దానం నాగేందర్, కడియం శ్రీహరి సరిగ్గా స్పందించలేదు. మొన్న దానం నాగేందర్ వెళ్లి స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిశారు. కానీ అఫీడవిట్ సమర్పించారా లేదా అనేది కూడా క్లియర్ గా తెలియదు. ఈ క్రమంలోనే దానం నాగేందర్ తాజాగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. తనకు ఎన్నికలు కొత్త కావని ఇప్పటికే 11 ఎన్నికల్లో పోరాడిన చరిత్ర తనకు ఉందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉందని తీర్పు రాకముందే గులాబీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
దానం నాగేందర్ కామెంట్లను బట్టి చూస్తుంటే ఖైరతాబాద్ ఉపఎన్నిక తప్పేలా లేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ టికెట్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. కాబట్టి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పలేరు. స్పీకర్ నిర్ణయం మీదనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది. స్పీకర్ కు సుప్రీంకోర్టు టైం విధించిన సంగతి తెలిసిందే. లీగల్ ఇష్యూస్ వచ్చేలా ఉన్నాయి.. అటు బిఆర్ ఎస్ పార్టీ కూడా ఈ అంశం మీద వెనక్కు తగ్గేలా కనిపించట్లేదు కాబట్టి ఆయన రాజీనామాకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల మధ్య రాజీనామా చేయడమే బెటర్ అని రేవంత్ సూచించారు అంట.
కాంగ్రెస్ టికెట్ మీద ఖైరతాబాద్ లో పోటీ చేస్తే గెలిపించుకుంటామని రేవంత్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఈ అంశాన్ని ఎక్కువ కాలం లాగకుండా స్పీకర్ నిర్ణయానికి ముందే దానం నాగేందర్ రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల తర్వాత ఆయన రాజీనామా ఉండనున్నట్టు సమాచారం. దీంతో గ్రేటర్ పరిధిలో మూడో ఉపఎన్నిక వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఏం జరుగుతుందో వెయిట్ చేద్దాం.