khairatabad : కన్నుల పండుగగా ఖైరతాబాద్ మహాగణపతి వేడుకలు..!
ఖైరతాబాద్ మహాగణపతి వేడుకలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. కాసేపట్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొలి పూజ నిర్వహించనున్నారు.;
ఖైరతాబాద్ మహాగణపతి వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. కాసేపట్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొలి పూజ నిర్వహించనున్నారు. ఖైరతాబాద్ గణేషుడు... ఈ సారి పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమిస్తున్నాడు. 40 అడుగుల ఎత్తులోని భారీ గణనాథుడిని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మహాగణపతికి ఇరువైపులా... కృష్ణకాళి, కాల నాగేశ్వరి దర్శనం ఇస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విఘ్నేశ్వరుడిని దర్శించుకునేలా ఉత్సవ సమితి ఏర్పాట్లు చేసింది. గతేడాది కొవిడ్ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. లడ్డు వేలం పాట కూడా రద్దు చేశారు. కానీ ఈ సారి లడ్డు వేలం పాట ఉంటుందని ఉత్సవ సమితి వెల్లడించింది.