Khammam : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత

Update: 2023-02-25 06:58 GMT

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులకు.. కమీషన్‌ వ్యాపారులకు మధ్య ఘర్షణతో ఉద్రిక్తత తలెత్తింది. మిర్చీ అమ్ముకోకుండా అడ్డుకోవడంతో.. కమిషన్ వ్యాపారిపై రైతు కుటుంబం దాడికి పాల్పడింది. దీంతో.. కమీషన్ వ్యాపారులు మార్కెట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఖమ్మం రూరల్ మండలం తీర్థాలకు చెందిన రైతులు.. కమీషన్ వ్యాపారి వెంకటేశ్వర్లు దగ్గర పంట పెట్టుబడికి అప్పు తీసుకున్నారు. పంట పండిన తరువాత వెంకటేశ్వర్లుకే అమ్మేవిధంగా ఒప్పందం చేసుకున్నారు.

ఇవాళ పంటను మార్కెట్ కి తీసుకొచ్చిన రైతులు.. వేరే వ్యాపారికి పంట అమ్ముతుండడంతో వెంకటేశ్వర్లు అడ్డుకున్నాడు. తన బాకీ చెల్లించి పంటను అమ్ముకోవాలనడంతో.. ఘర్షణ ప్రారంభమైంది. వ్యాపారిపై రైతులు దాడికి దిగారు. దీంతో ఖమ్మం మిర్చి మార్కెట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులు తమపై అన్యాయంగా దాడికి దిగారని.. మార్కెట్లో కొనుగోళ్లు నిలిపివేయాలని వ్యాపారులు ఆందోళనకు దిగారు.

Similar News