Khammam: అందరికీ ఆదర్శంగా నిలిచిన ఖమ్మం అడిషనల్ కలెక్టర్ స్నేహలత.. ప్రభుత్వాసుపత్రిలో..
Khammam: రాజకీయ నేతలు, బాడా బాబులు చేప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదు.;
Khammam: రాజకీయ నేతలు, బాడా బాబులు చేప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదు. ప్రభుత్వాసుపత్రుల్లోనే సేవలు పొందాలంటూ, తాము మాత్రం కార్పొరేట్ ఆసుపత్రులవైపు పరుగులు పెడుతుంటారు. అయితే కొందరు అధికారులు మాత్రం చేప్పేదే ఆచరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అదే కోవలోకి వస్తారు ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత.
ప్రజల్లో ప్రభుత్వ వైద్య సేవలపై మరింత నమ్మకం పెంచేందుకు తన తొలి కాన్పును ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేయించుకున్నారు అడిషనల్ కలెక్టర్ స్నేహలత. పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. మాతాశిశు కేంద్రంలో ఉన్న అడిషనల్ కలెక్టర్ స్నేహలతను మంత్రి అజయ్ కుమార్ పరామర్శించారు. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు.