ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ
ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.. రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యం మారిపోతోంది.. నాలుగో రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు..;
ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.. రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యం మారిపోతోంది.. నాలుగో రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.. రెండోస్థానంలో తీన్మార్ మల్లన్న, మూడో స్థానంలో కోదండరామ్ వున్నారు.. నాలుగో రౌండ్‌లో 52వేలా 771 ఓట్లకుగాను పల్లా రాజేశ్వర్ రెడ్డికి 15,897 ఓట్లు వచ్చాయి.. తీన్మార్ మల్లన్నకు 12 వేలా 146 ఓట్లు పోలయ్యాయి.. టీజేఎస్ కోదండరామ్‌కు 10వేలా 48 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 5వేలా 99 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 4వేలా 3 ఓట్లు పోలయ్యాయి.